Monday, March 19, 2012

జ్యోతిశ్శాస్త్రం అనే యీ బ్లాగు యెందుకు?

అందరికీ నమస్కారం.  నా యీ కొత్త బ్లాగుకు సుస్వాగతం!

ముందుగా ఇది స్పష్టం చేయవలసి ఉంది అందరికీ.   నేను జ్యోతిషవిద్వాంసుడను కాను.   అలాగే నేను వృత్తిరీత్యాగాని hobby రీత్యా కాని జ్యోతిష్కుడను కాను.

జ్యోతిశ్శాస్త్రం అనేది ఒక శాస్త్రమే కాదు, దాని గురించి ఒక బ్లాగు నడపటానికి యెందుకు తంటాలు పడతావు అనే వారికొక నమస్కారం. నా దగ్గర మిమ్మల్ని మెప్పించగల జవాబు యేమీలేదు.

జ్యోతిశ్శాస్త్రం మహాసముద్రం వంటిది, దాని గురించి ఒక బ్లాగు నడపటానికి యెంతో ధ్యైర్యముండాలి గాని నీకు అంత అర్హత ఉన్నదా అనే వారికొక నమస్కారం. నా దగ్గర మిమ్మల్ని మెప్పించగల జవాబు యేమీలేదు.

మరి యీ ప్రయత్నం దేనికి, ఈ బ్లాగు యెందుకు అంటే కూడా నిజానికి నా దగ్గర మిమ్మల్ని మెప్పించగల జవాబు యేమీలేదు.

సవినయంగా నేను చెప్పగల మాటలు విజ్ఞులు మన్నించి ఆలకించాలి.

వేదాంగమైన జ్యోతిషం ఆధునికుల నిరాదరణకు గురికావటానికి, ఛాందసుల పిడివాదాలకు నిలయంగా మారటానికీ కూడా కారణం ఒకటే.  ఈ జ్యోతిషం గురించి తెలిసినవారికన్నా దాని గురించి అటో యిటో మాట్లాడే వారి సంఖ్యా చాలా హెచ్చుగా ఉండటానికీ కారణం గూడా అదే.  అది యీ జ్యోతిషం గురించిన అధ్యయనం జనసామాన్యానికి అందుబాటులో లేకపోవటమే.

నా అధ్యయన ప్రయత్నమంతా ఒక బ్లాగుగా ఉంటే బాగుగా ఉంటుందన్న ఊహతో యీ బ్లాగు తెరవటం జరిగింది.   అసలు blog అంటేనే  Web log అన్నదానికి క్లుప్తరూపం కదా!

చదువరులు తమ తమ అభిప్రాయాలను సందేహాలను నాతో పంచుకోవచ్చును.  వారికి నా హృదయపూర్వకమైన ఆహ్వానం.  

అవకాశం దొరికిందిగదా అని కొందరు దుర్వాఖ్యానాలు చేయవచ్చును. కాని అటువంటివి నిష్ప్రయోజనం కాబట్టి ప్రకటించటం కూడా జరుగదు. 

9 comments:

  1. చాల మంచి ప్రయత్నం. Wish you good luck
    :Venkat.

    ReplyDelete
  2. మీకు ధన్యవాదాలు శ్యామల రావు గారు....కాళీ నరేన్

    ReplyDelete
  3. సదుద్దేశ్యంతో ఆరంభిస్తున్న మీకు అభినందనలు.
    చక్కటి విషయాలు చర్చకు వస్తాయని ఆశిస్తాను.

    ReplyDelete
  4. చాలా మంచి ప్రయత్నం అండీ
    ఈశ్వరుడు మీ మంచి ప్రయత్నానిని సఫలం చేయాలని కోరుకుంటున్నాను

    ReplyDelete
  5. శ్యామలీయం వారు,

    శుభమస్తు !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. I like your blog and the motive behind it. Wish you all the success.

    Satyam Vallabha

    ReplyDelete
  7. Very Good attempt.All the best.
    Blog=Web-log. true.Got your pont.

    ReplyDelete

వ్యాఖ్యలకు అనుమతి అవసరం!