Saturday, January 26, 2013

వింశోత్తరీ చరదశల జంత్రీ



ఈ‌ క్రింద చూపిన జంత్రీ వింశోత్తరీ చరదశాకాలప్రమాణాలను గణితం చేయటానికి చాలా సహాయకారిగా ఉంటుంది.


గ్రహం రవి చంద్ర కుజ రాహు గురు శని బుధ కేతు శుక్ర
రవి 0-1-6 0-2-0 0-1-12 0-3-18 0-3-6 0-3-24 0-3-12 0-1-12 0-4-0
చంద్ర 0-2-0 0-3-10 0-2-10 0-6-0 0-5-10 0-6-10 0-5-20 0-2-10 0-6-20
కుజ 0-1-12 0-2-10 0-1-19 0-4-6 0-3-22 0-4-13 0-3-29 0-1-19 0-4-20
రాహు 0-3-18 0-6-0 0-4-6 0-10-24 0-9-18 0-11-12 0-10-6 0-4-6 1-0-0
గురు 0-3-6 0-5-10 0-3-22 0-9-18 0-8-16 0-10-4 0-9-2 0-3-22 0-10-20
శని 0-3-24 0-6-10 0-4-13 0-11-12 0-10-4 1-0-1 0-10-23 0-4-13 1-0-20
బుధ 0-3-12 0-5-20 0-3-29 0-10-6 0-9-2 0-10-23 0-9-19 0-3-29 0-11-10
కేతు 0-1-12 0-2-10 0-1-19 0-4-6 0-3-22 0-4-13 0-3-29 0-1-19 0-4-20
శుక్ర 0-4-0 0-6-20 0-4-20 1-0-0 0-10-20 1-020 0-11-10 04-20 1-1-10


ఈ జంత్రీ నిలువు మరియు అడ్డు వరుసల విషయంలో సౌష్టవం కలిగి ఉంది.
నిలువును ఇష్ట చరగ్రహం అనుకుంటే, అడ్డు వరుసలో గ్రహాన్ని ఇష్టనక్షత్రాధిపతి అనుకోవాలి.
సౌష్టవం కారణంగా తవ్దిలోమంగా అనుకున్నా యేమీ తేడా రాదు.
ఈ జంత్రీలోని యే గడిలోనైనా ఉన్న విలువ సం-నె-రోజులుగా గ్రహించాలి.  అవసరమైతే ఈ విలువను సులభంగా రోజుల లోనికి మార్చవచ్చును. అలా మార్చటానికి నెలకు ౩౦రోజులుగా గ్రహించాలి.

ఉదాహరణ:
ప్రశ్న:  చంద్రుడు ఉత్తరా నక్షత్రంలో యెన్నాళ్ళు చరిస్తాడు?
ఉత్తరానత్రాధిపతి కుజుడు.
కాబట్టి మనం చూడావలసిన గడి చంద్ర  x కుజ.
ఈ గడిలో ఉన్న విలువ 0-2-10.
అంటే 0 సం॥ 2 నె॥ 10 రోజులు.

దీనికి గణితం
    చంద్ర x కుజ = 10  x 7 = 70 =  0 - 2 - 10

ఇదే విధంగా అన్ని గ్రహాలకు చరగ్రహాల యొక్క భ్రమణాలలోని వివిధ నక్షత్రస్థితికాలాలను తెలిసికోవచ్చును.

యే చరగ్రహం అయినా ఒక భ్రమణం పూర్తి చేయటానికి పట్టే కాలం దాని వింశోత్తరీ సంవత్సరసంఖ్య అన్ని సంవత్సరాలు.

ఈ జంత్రీ సాయంతో‌ నక్షత్రారంభం నుండి యే చరగ్రహం అయినా ఒక నక్షత్రంలో సంచరించే రోజులు తెలుసుకుంటున్నాం. కాని పీఠికలో గ్రహాలు సరిగ్గా నక్షత్రారంభస్థానాల్లో ఉండవు కదా. అందుచేత యే చరగ్రహం అయినా మొదటిదశను యెంత భాగం భోగించిందీ యింకెంత శేషం ఉన్నదీ తెలుసుకోవటం చాల అవసరం అవుతుంది కదా? దానికి ఉపాయం యేమిటీ అన్న ప్రశ్న వస్తుంది.

మనం దానికి తగిన గణితం చేద్దాం.  ఏ నషత్రం అయినా 800నిముషాల ప్రమాణం కలిగి ఉంటుంది.  ఒక యిష్ట వింశోత్తరీచరదశ ప్రమాణం k  అనుకుంటే ఒక నిముషం కాలంలో గడిచే చరదశా ప్రమాణం విలువ

   k  x 24 / 800 గంటలు.

= 3 k / 100 గంటలు.

ఉదాహరణకు శుక్రచరదశలో శుక్ర నక్షత్రంలో ఒక నిముషం ప్రమాణం కల చాపం గడవటానికి పట్టే చరదశాకాలం విలువ
౩ x (20x20) / 100  = 1200 / 100 గంటలు = 12 గంటలు.

అలాగే చరరవి గ్రహం రవి నక్షత్రంలో ఒక ననిమిషం దూరం చాపం గడవటానికి పట్టే కాలం వలువ
3 x (6 x 6) / 100 = 108 / 100 = 1.08 గంటలు = 1గం. 4ని. 48సె.
మనకు నిముషాలు సెకనులు లెక్కించేటంత అవుసరం లేదు కాబట్టి దీనిని 1గంట అనుకోవచ్చును.

మనకు అవుసరం అయితే యీ లెక్కను నిముషాలకాలప్రమాణంతోచేయవచ్చును.
ఎలాగంటే వెనుకటి గణనంలోని 3k/100 గంటలు  = 1.8k నిముషాలు.
ఇప్పుడు రవిస్వనక్షత్రంలో గడిపే నిమిషం కోణం దూరానికి పట్టే సమయం 1.8 x 36 = 64.8 నిముషాలు.
ఇది సులభమే అయినా మనం సమయాన్ని రోజులు గంటలలో కొలవటం సరిపోతుంది.

వచ్చే టపాలో ఒక (కల్పిత)జాతక చక్రం తీసుకుని ఆరంభకాల చరదశశేషాలు గణనం చేద్దాం.
ఇది భయపడవలసినంత కష్టం కాదని మీకు తప్పక బోధపడుతుంది కూడా.

3 comments:

  1. అయ్యా! మీరు ఇచ్చిన సమాచారము చాలా చక్కగా వుంది. సులభ శైలిలో వుంది. ఇలా అందించినందుకు మీకు ధన్యవాదములు. నాదొక మనవి కుజుని నక్షత్రాలు మృగశిరా,చిత్త,ధనిష్ట మరి కృత్తిక,ఉత్తర,ఉత్తరాషాడ సూర్యుని నక్షత్రాలు గమనించగలరని నా ప్రార్ధన. దయచేసి తప్పుని సవరించడానికే గాని తప్పని చూపించడానికి కాదని నామనవి, గమనించగలరు. కొత్తగా నేర్చుకునేవారికిది ఎంతో సహాయపడగలదు. మంచి సమాచారము అందించినందుకు మరియొక్కసారి మీకు నా ధన్యవాదములు.

    ReplyDelete
  2. Waiting for new post sir...plc post it..

    ReplyDelete
  3. Waiting for new post...plc post it sir...

    ReplyDelete

వ్యాఖ్యలకు అనుమతి అవసరం!