Saturday, January 26, 2013

వింశోత్తరీ చరదశాప్రస్తారం యొక్క సంపూర్ణావర్తన కాలం యెంత?


వింశోత్తరీ చరదశాప్రస్తారం యొక్క సంపూర్ణావర్తన కాలం యెంత అనే విషయం తెలుసుకోవటం చాలా ఆసక్తికరమైన విషయం.

ఒక సారి మనం ప్రతి గ్రహం యొక్క వింశోత్తరీ దశా ప్రమాణ కాలం యెంతో పరిశీలిద్దాం.  ఈ‌ పట్టిక ముందు చూసినదే నని గురు తెచ్చుకోగలరు సులభంగా



గ్రహం దశా సంవత్సరాలు
రవి 6
చంద్రుడు 10
కుజుడు 7
రాహువు 18
గురుడు 16
శని 19
బుధుడు 17
కేతువు 7
శుక్రుడు 20


ఒకగ్రహం యొక్క వింశోత్తరీ చరదశా పూర్ణావర్తనం అంటే అది పీఠిక మీది స్థిరగ్రంహంతో సంయోగం చెందటం.
ఉదాహరణకు ఇది రవికైతే 6 సంవత్సరాలు, శుక్రుడికి 20 సంవత్సరాలు.

అంటే 120  సంవత్సరాలలో రవి 120 / 6 = 20 పూర్ణావర్తనాలు చేస్తాడన్నమాట.

ఇలా అన్నిగ్రహాలు ఒకేసారి పూర్ణావర్తనాలు పూర్తిచేసిన సంఘటన జరగటానికి పట్టే కాలం
    6, 10, 7, 18, 16, 19, 17, 20
సంఖ్యల  కనిష్ట సామాన్య గుణిజం (క.సా.గు) అవుతుంది.

ఈ సంఖ్య 16,27,920.

అంటే 16,27,920 సంవత్సరాలు గడిస్తే కాని సంపూర్ణ వింశోత్తరీ చర దశా వర్తనం కాదన్న మాట,
ఇది త్రేతాయుగం కంటే హెచ్చు సంవత్సరాలు!  ఎందుకంటే త్రేతాయుగప్రమాణం 12,96,000 సంవత్సరాలే కదా.
అన్నట్లు మన కలియుగం పాపం 4,32,000 సంవత్సరాలే సుమండీ.

అందుచేత ప్రజలారా,  ఏ జాతకంలోనైనా సరే వింశోత్తరీ చరదశా పూర్ణావర్తనం జరిగి అది చరగ్రహాలన్నీ వాటివాటి పీఠికాస్థితస్థిరగ్రహాలతో సమైక్యం కావటం ఆ జాతకుడి జీవితకాలంలో కలలో కూడా జరుగనే జరుగదు.  కాబట్టి ఈ విషయంలో నిశ్చింతగా ఉండవచ్చును.

ఈ వింశోత్తరీ నూతనవిధానాన్ని పరిశీలించి ఫలితాలు సంపుటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

2 comments:

  1. అన్నా.. మీ జ్యోతిశ్శాస్త్రం బ్లాగ్ చూసిన తరువాత మీరెంత గొప్పవారో అర్థమైంది.. యేమైనా తప్పుగా మాట్లాడివుంటే .. చిన్నదాన్ని మన్నించండన్నా..

    ReplyDelete
    Replies
    1. అమ్మా మీ సందేశం చాలా ఆలస్యంగా చూసి స్పందిస్తున్నందుకు మన్నించండి. ఈ బ్లాగును నేను తరచుగా update చేయటం లేదు కాబట్టి ఈ కామెంట్ ఆలస్యంగా చూడటం జరిగిందని దయచేసి అర్థం చేసుకోవలసిందిగా ప్రార్థన,

      ఇకపోతే నేనేమీ గొప్పవాడిని కానేకాను కాబట్టి నిశ్చింత మీకూ నాకూ కూడా!

      Delete

వ్యాఖ్యలకు అనుమతి అవసరం!